తెలంగాణలో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. వనపర్తి జిల్లా రేవల్లి మండలం గౌరిదేవిపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కేఎల్‌ఐ రిజర్వాయర్‌లో దూకి ఆ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది. గజ ఈతగాళ్లు వారి మృతదేహాల కోసం గాలింపు చేపట్టారు. మృతుల్లో ప్రియుడు నరేష్‌ది నాగర్‌కర్నూల్‌లోని సంజయ్‌నగర్ కాగా.. ప్రియురాలిది కల్వకుర్తిగా పోలీసులు గుర్తించారు. నరేష్‌కు గతంలోనే వివాహమైనట్లు పోలీసులు తెలిపారు.