ప్రభాస్ తన స్నేహితులైన యువి క్రినేషన్స్ వారితో కలిసి నెల్లూరు జిల్లాలోని సూళ్లూరు పేటలో “వి ఏపిక్” పేరిట మల్టి ప్లెక్స్ నిర్మించిన విషయం తెలిసిందే. ఆగష్టు ౩౦న సాహో సినిమాతో ఈ థియేటర్ లాంచ్ కానుంది. ఈ మల్టి ప్లెక్స్ కు షాపింగ్ మాల్ కూడా ఎటాచ్ అయ్యి ఉంటుంది. ఇక ఈ థియేటర్ విశేషం ఏమిటంటే సౌత్ ఏసియాలోనే ఇంత పెద్ద స్క్రీన్ ఉన్న థియేటర్ లేదు.
అలాగే లేటెస్ట్ డాల్బీ అట్మాస్ సౌండ్ ఎక్విప్మెంట్తో ఉంది. దాంతో ఈ థియేటర్ పైనే అందరి దృష్టి ఉంది. మరి ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ సాహో ని ఈ థియేటర్ లో ఫస్ట్ వీక్లో చూడాలని ఉత్సాహపడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఈ థియేటర్ ఓపెనింగ్కు టైంలో ప్రభాస్ లండన్ లో ఉండబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ పెద్ద నాన్న, నటుడు కృష్ణం రాజు ఉప ముఖ్యమంత్రి వెంకయ్య నాయుడితో కలిసి ఈ థియేట లాంచింగ్కు రానున్నట్లు తెలుస్తోంది.