ముంబయిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. టార్డియోలోని భాటియా ఆస్పత్రి సమీపంలో.. 20 అంతస్తుల భవనంలోని 18వ ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 2 మరణించారని.. 15 మంది వరకు గాయపడ్డారని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని సమీపంలోని భాటియా ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తం అయ్యారు. 13 ఫైర్ ఇంజన్లు, ఏడు వాటర్ జెట్టీలు, మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.
ముంబయిలో భారీ అగ్నిప్రమాదం..ఇద్దరు మృతి..పలువురికి గాయాలు
Two killed in Mumbai fire