ఇండియాలో కరోనా కల్లోలం..ఒక్క రోజే 3.33 లక్షల కేసులు నమోదు

Corona fluctuation in India .. 3.33 lakh cases registered in a single day

0
97

మన దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. థర్డ్ వేవ్ నేపథ్యంలో ఈ మహమ్మారి కరోనా కేసులు ఇప్పుడు.. లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. ఇక తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 3,33,533 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. అలాగే ఒక్కరోజే వైరస్​తో మరో 525 మంది మరణించారు. 2,59,168 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 17.78 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రికవరీ రేటు 93.18 శాతం నమోదైనట్లు పేర్కొంది.

ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 21,87, 205కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 93.18 శాతంగా ఉంది. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీల సంఖ్య 3,65,60,650 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 161.92 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.

మొత్తం కేసులు: 3,92,37,264

మొత్తం మరణాలు: 4,89,409

యాక్టివ్ కేసులు: 21,87,205

మొత్తం కోలుకున్నవారు: 3,65,60,650