ప్రతి మూడు నెలలకు ఒకసారి టూత్ బ్రష్ ని ఎందుకు మార్చాలి?

0
83

కరోనా మహమ్మారి వల్ల చాలా మంది నానా తంటాలు పడుతున్నారు. ఇలాంటి  సమయంలో వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే కరోనా నుండి రికవరీ అయిన వాళ్ళు తప్పని సరిగా వాళ్ల యొక్క టూత్ బ్రష్ ని మార్చాలి.

సాధారణంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి టూత్ బ్రష్ ని మార్చాలి. ప్లాస్టిక్ లో ఉండే వైరస్ ఎక్కువ కాలం పాటు ఉండగలదు. కాబట్టి టూత్ బ్రష్ ని మార్చడం మనకు ఎంతో సురక్షితం. కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత కూడా టూత్ బ్రష్ ని మార్చాలి. దీంతో మళ్లీ మీరు ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉంటారు.అదే విధంగా మీ కుటుంబ సభ్యులు కూడా ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉంటారు.

అది ఎలా అంటే సాధారణంగా అందరూ వాళ్ళ యొక్క బ్రష్లని వాష్ రూమ్ లో పెడుతూ ఉంటారు. దానివల్ల ఒకరి బ్రష్ నుండి మరొకరి బ్రష్ కి వైరస్ అంటుకునే ప్రమాదం వుంది. దీంతో వాళ్లు కూడా వైరస్ బారిన పడే అవకాశం ఉంటుంది. కనుక కరోనా వైరస్ వచ్చి తగ్గిన తర్వాత తప్పకుండా టూత్ బ్రష్ ని మార్చండి. లేదంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.