టాలీవుడ్ లో రామ్ చరణ్..తన నటనతో అంచెలంచెలుగా ఎదుగుతూ మెగా పవర్ స్టార్ గా ఎదిగాడు. సినీ ప్రపంచానికి ఆయన మంచినటుడనే విషయం మాత్రం ఇప్పటి వరకు తెలుసు. అయితే సైరా మూవీతో ఆయన పవర్ పుల్ ప్రొడ్యూసర్ అనే విషయాన్ని రుజువు చేశాడు చెర్రీ. ‘సైరా’ మూవీ ఆలోచన ఇప్పటిది కాదు.ఈ సినిమా చేయలన్న ఆలోచన మెగాస్టార్ కి పదేళ్ళ క్రితమే వచ్చిందట. కానీ సినిమా సెట్స్ పైకి రాకపోవడానికి బడ్జెట్ ఒకే ఒక్క రీజన్ గా మారింది. అందుకే మెగాస్టార్ చిరు..ఈ సినిమా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని పక్కన పెట్టేశారు.
మెగా స్టార్ ఆలోచనలో ఉన్న మూవీ ఆచరణకు సాధ్యపడిందంటే అది కేవలం రామ్ చరణ్ వల్లే చెప్పాలి. టాలీవుడ్ టెక్నికల్ స్టాండర్డ్స్ ఒక్కటే కాదు. మార్కెటింగ్ బారియర్స్ కూడా పూర్తిగా మారిపోయాయి. టాలీవుడ్ లోనే ఫస్ట్ టైమ్ తండ్రి సినిమాని నిర్మిస్తున్న ప్రొడ్యూసర్ అనిపించుకున్నాడు. సినిమాను మంచిగా నిర్మించడం చిత్ర యూనిట్ పని ..కానీ దాన్ని ప్రోమోట్ చేయడంలోనే నిర్మాత సామర్ధ్యం ఏంటనేది తెలుస్తోంది. రామ్ చరణ్ అడ్మినిస్ట్రేషన్ ‘సైరా’షూటింగ్ లో ఎలా ఉందనేది ఫ్యాన్స్ కి అంతగా తెలీకపోయినా…చెర్రీ సినిమాని బాలీవుడ్ లో ప్రమోట్ చేస్తున్న తీరు చూస్తుంటే చెర్రీ జస్ట్ మెగాపవర్ స్టారే కాదు.మెగా పవర్ ప్రొడ్యూసర్ అనిపిస్తోంది.
ఓ వైపు హీరోగా బిజీగా ఉంటూ నిర్మాతగా.. అందునా చిరంజీవి సినిమాలకు నిర్మాతగా వ్యవహరిచాలంటే చాలా అనుభవం కావాలని అనుకున్నారంతా.కానీ చెర్రీ సింపుల్ గా.. ‘సైరా’ బిగ్గెస్ట్ హిస్టారికల్ సినిమా బాధ్యతలనే సక్సెస్ ఫుల్ గా హ్యాండిల్ చేస్తున్నాడు రామ్ చరణ్.