ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ”సాహో”. సినిమా ఈ నెల 30న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ రేంజ్‌లో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా భారీ విడుదలకు సిద్ధమవుతోంది. ”బాహుబలి” తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంపై ఓ రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి.
ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో ప్రభాస్‌ను కలుసుకునే అవకాశాన్ని నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్ కల్పించింది. ప్రభాస్‌ను ఎలా కలుసుకోవాలనే దానిపై ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ మాట్లాడుతూ ”హాయ్ డార్లింగ్స్.. నన్ను కలుసుకోవాలనుకుంటన్నారా? ”సాహో” పోస్టర్‌తో పాటు ఓ సెల్ఫీ తీసుకుని, దాన్ని నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కి ట్యాగ్ చేయండి. నేనే పర్సనల్‌గా విన్నర్స్‌ను సెలక్ట్ చేస్తాను” అన్నారు.
మరింకేం ”సాహో” పోస్టర్ కానీ, స్టాండీ, కటౌట్, ఫ్లెక్సీ, టీవీ లేదా కంప్యూటర్‌లో కానీ సాహో స్టిల్ ఏదైనా సరే. ఓ సెల్ఫీ దిగేయండి. ఆ సెల్ఫీని ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ @actorprabhas కు ట్యాగ్ చేసేయండి. ప్రభాస్‌ను పర్సనల్‌గా కలుసుకునే అవకాశాన్ని ఉపయోగించుకోండి.