Breaking- వైఎస్‌ షర్మిల సంచలన నిర్ణయం

0
87

YSRTP పార్టీ అధ్యక్షురాలు, వైఎస్‌ షర్మిల సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో ఇప్పటి వరకు ఉన్న అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్లు షర్మిల ప్రకటన చేశారు. కమిటీల స్థానంలో జిల్లాలకు కోఆర్డినేటర్లను నియమిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. గత ఏడాది పార్టీని ప్రకటించిన అనంతరం రాష్ట్ర స్థాయిలో అధికార ప్రతినిధులను, సోసల్‌ మీడియా ఇన్‌ చార్జీలను నియమించారు. అయితే.. ఇప్పుడు అన్ని కమిటీలను ఒక్కసారిగా రద్దు చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.