చిరుకు జోడీగా హీరోయిన్​ త్రిష?

Heroine Trisha as Chiruku Jodi?

0
116

మెగాస్టార్‌ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్‌ జోష్‌ లో ఉన్నారు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ‘వాల్తేరు వీర్రాజు’ గాడ్‌ ఫాదర్‌, భోళా శంకర్‌ సినిమాలు లైన్‌ లో ఉన్నాయి. దీంతో పాటు వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా ఓ సినిమా రాబోతుంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజి అప్డేట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ చిత్రంలో కథానాయికగా మొదట శ్రుతిహాసన్ పేరు వినిపించింది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్​గా త్రిష ఎంపికైనట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. త్రిష తొలిసారిగా ‘స్టాలిన్​’ చిత్రంలో మెగాస్టార్​ సరసన నటించారు. ఈ చిత్రం 2006లో విడుదలైంది.

మరోవైపు ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డితో కొద్దిరోజుల క్రితం మెగాస్టార్‌ చిరంజీవి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఇక టాలీవుడ్‌ పరిశ్రమ సమస్యలు, సినిమా టికెట్ల ధరలపై ఈ సందర్భంగా సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డితో చిరంజీవి చర్చించారు. చర్చల అనంతరం చిరు అందరికి అనుకూలమైన వార్తే వస్తుందని కూడా హింట్ ఇచ్చారు.