Big Breaking: కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు (వీడియో)

0
107

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘కొండా’. కొండా మురళి, సురేఖ జీవిత కథతో ఈ సినిమా రానుంది. ఈ సినిమాలో కొండా మురళి పాత్రలో అదిత్ అరుణ్, సురేఖపాత్రలో ఇర్రా మోర్ కనిపించనున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తైంది.

నిజాలన్నీ కళ్ళకు కట్టినట్టుగా కొండా చిత్రంలో కనబడతాయన్నారు. కొండా లాంటి అసాధారణ శక్తికి ఆదిపరాశక్తి లాంటి సురేఖ తోడైనప్పుడు.. ఆశక్తులను చూసి ఓర్వలేక చుట్టూ ఉన్న రూపంలో ఉన్న కొందరు జంతువులు కొందరు చేసిన క్షుద్ర కుట్రలను తిప్పికొడుతూ.. తెలంగాణలో చేసిన ఓ కురుక్షేత్ర యుద్దమే..మా కొండా చిత్రం” అంటూ చెప్పుకొచ్చారు  వర్మ.  తాజాగా కొండా చిత్రం మొదటి ట్రైలర్‌ను రిపబ్లిక్‌ డే రోజు ఉదయం 10 గంటల 25 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో కొండా సురేఖ నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో సురేఖతో పాటు ఆర్జీవీ ఉన్నాడు. వీడియోలో కొండా సురేఖ మాట్లాడుతూ..ఒరేయ్ ధర్మారెడ్డిగా, దయాకర్ రావుగా అరచేతిని అడ్డుపెట్టి సూర్య కాంతిని ఆపలేరు మీరెన్ని కథలు పడ్డ కొండా మూవీ ట్రైలర్ ను అడ్డుకోలేరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో చివరలో ఆర్జీవీ లాల్ సలాం అంటూ ముగింపు పలకడం కొసమెరుపు.

వీడియో కోసం కింది లింక్ ను క్లిక్ చేయండి

 

https://twitter.com/RGVzoomin/status/1486004261641416710?t=lm2Piw7sXFQ1KtiKGjsK3g&s=19