Flash: ఏపీలో శాంతించిన క‌రోనా..తగ్గిన పాజిటివ్ కేసులు..పెరిగిన మరణాలు!

Corona calmed down in AP..declined positive cases..increased deaths!

0
124

ఏపీలో కరోనా కల్లోలం కాస్త తగ్గింది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడం కలకలం రేపుతుండగా తాజాగా కేసుల సంఖ్య తగ్గడం ఊరట కలిగిస్తుంది. తాజాగా ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 40,635 సాంపిల్స్ పరీక్షించగా..12,561 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,24,571  చేరింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది.

అలాగే ఒక్కరోజు వ్యవధిలో మరో 12 మంది కరోనా బారిన పడి మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,13,300యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 8,742 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 2117822కి చేరింది. నేటి వరకు రాష్ట్రంలో 3,23,65,775 శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.

కాగా గడిచిన 24 గంటల్లో జిల్లాల వారీగా కేసులు ఈ విధంగా ఉన్నాయి.

అనంతపురం  853

చిత్తూరు         423

ఈస్ట్ గోదావరి   1067

గుంటూరు  1625

వైస్సార్ కడప  1215

కృష్ణ   1056

కర్నూల్  1710

నెల్లూరు   1009

ప్రకాశం    869

శ్రీకాకుళం 340

విశాఖపట్నం  1211

విజయనగరం 489

వెస్ట్ గోదావరి   694