మహేశ్ మంజ్రకేర్ దర్శకుడిగానూ నటుడిగానూ ఎంతో గుర్తింపు పొందాడు. తెలుగులోనూ పలు సినిమాలలో విలన్ పాత్రలతో పాటు సహాయ నటుడి పాత్రలోనూ నటించాడు. మహేశ్ మంజ్రేకర్ కూతురు సయీ మంజ్రేకర్ తెలుగు గని, మేజర్ సినిమాలలో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మహేశ్ మంజ్రేకర్ కూడా తెలుగులో ఆన్ శ్రీను, గుంటూర్ టాకీస్, వినయ విధేయ రామ, సాహో వంటి సినిమాలలో నటించాడు.
కానీ ఇప్పుడు మహేశ్ మంజ్రేకర్ వివాదంలో చిక్కుకున్నాడు. మహేశ్ మంజ్రేకర్ తెలుగులోనూ పలు సినిమాల్లో నటించారు. ఆయనపై మరాఠా సేవా సంస్థ కోర్టులో ఫిర్యాదు చేసింది. ఎందుకంటే డైరెక్టర్ మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలో ఈ నెల 14న నయ్ వరన్ భట్ లోంచా కొన్ నయ్ కోంచా అనే సినిమా విడుదల అయింది. అయితే ఈ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని మరాఠా సేవా సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది.
అయితే నయ్ వరన్ భట్ లోంచా కొన్ నయ్ సినిమాలో పలు శృంగార సన్నివేశాల్లో మహిళలు, చిన్నారులను అభ్యంతరకరంగా చూపించారని మరాఠా సేవ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో డైరెక్టెర్ మహేశ్ పై చర్యలు తీసుకోవాలని కోర్టులో ఫిర్యాదు చేసింది. కాగ ఈ కేసు ఈ వచ్చె నెల 28న విచారణకు రానుంది.