Beaking: తెలంగాణలో కలకలం..వేర్వేరు మండలాల్లో రాజు తల, మొండెం

0
99

తెలంగాణలో దారుణ హత్య కలకలం సృష్టించింది. వ్యక్తిని చంపి తల, మొండెం వేర్వేరు మండలాల్లో పడేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఉలిక్కిపడేలా చేసింది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం వెలిమెల తండాకు చెందిన కడవత్ రాజు స్థానికంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. మూడు రోజుల క్రితం రాజుకు ఫోన్ రావడంతో ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. ఇక అప్పటి నుంచి తిరిగి ఇంటికి రాలేదు. ఎక్కడ గాలించినా రాజు ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తాజాగా ఈరోజు రాజు తల రాయికోడ్ పోలీస్​స్టేషన్ పరిధిలోని కుసునూరు వాగులో దొరకగా మొండెం మానూర్ మండల పరిధిలో సింగూర్ బ్యాక్​వాటర్​లో​ గాలించగా లభ్యమైంది. ఈ హత్యపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.