వచ్చే ఎన్నికల లోపు ఆ టార్గెట్ రీచ్ అవ్వాల్సిందే – రేవంత్ రెడ్డి

That target must reach within the next election - Rewanth Reddy

0
84

టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. సమయం దొరికినప్పుడల్లా టిఆర్ఎస్ ను ఇరకాటంలో పెడుతున్నారు. తాజాగా కొద్దిరోజుల క్రితం రేవంత్ డిజిటల్ మెంబెర్షిప్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ..డిజిటల్ మెంబెర్షిప్ ను కాంగ్రెస్ పార్టీ నాయకులు కీలకంగా తీస్కొని పని చేయాలి. పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయడానికి మెంబెర్షిప్ చాలా అవసరం. రాబోయే ఎన్నికలలో మెంబెర్షిప్ చాలా ముఖ్యం. కాంగ్రెస్ కు తెలంగాణ లో మంచి క్యాడర్ ఉంది.. నాయకులు వారిని తట్టి లేపి పనులు చేయించాలి. మనకు డిజిటల్ మెంబెర్షిప్ చేయించి డాటా అంత క్రోడీకరించి పెట్టుకుంటే ఎన్నికలలో చాలా ఉపయోగం.

ఏఐసీసీ డిజిటల్ మెంబెర్షిప్ ను చాలా సీరియస్ గా తీస్కుంటుంది. ఒక నియోజకవర్గంలో బాగా జరిగి ఇంకో దగ్గర డల్ గా ఉంటే ప్రయోజనం లేదు. సమన్వయ కర్తలు, ఇంచార్జి లు సంబంధిత నాయకులు అంత కలిసికట్టి టార్గెట్ రీచ్ కావాలి. అన్ని బూతులలో ఎన్ రోలర్ నియామకం తప్పనిసరిగా చేయాలి.ప్రతి బూత్ లో కనీసం 100 డిజిటల్ మెంబెర్షిప్ తప్పనిసరిగా చేయాలి. మెంబెర్షిప్ లో బాగా పని చేసిన వారికి పార్టీ లో మంచి భవిష్యత్ ఉంటుంది..డిజిటల్ మెంబెర్షిప్ లో పని చేయని వారికి పార్టీలో పదవులు రావడం చాలా కష్టం.. రాజకీయాలు చేద్దాం అనుకున్న వారు డిజిటల్ మెంబెర్షిప్ లో మంచి ప్రతిభ చూపాలన్నారు రేవంత్.