దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఇప్పటికే సామాన్యులతో పాటు పలువురు సినీ తారలు ఈ మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా బాలీవుడ్ అలనాటి స్టార్ హీరోయిన్ కాజోల్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు కాజోల్.
నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. అయితే జలుబు కారణంగా ఎర్రగా మారిన నా ముక్కును మీకు చూపించాలని అనుకోవడం లేదు. బదులుగా ఈ ప్రపంచంలోనే అత్యంత అందమైన నవ్వును చూడండి” అంటూ తన కూతురు నైసా దేవ్‌గణ్ ఫొటోను షేర్ చేశారు కాజోల్.