ఎన్టీఆర్ తో ఉప్పెన డైరెక్టర్ సినిమా..25 KGF లకి సరిపడే స్క్రిప్ట్ అంటూ..

Surprise director movie with NTR ..

0
103

తీసింది ఒకే ఒక్క సినిమా. కాని అది బ్లాక్ బస్టర్ హిట్. ఉప్పెన లాంటి సినిమా తీసి కరోనా కష్టకాలంలో ఇండస్ట్రీలో హిట్ కొట్టాడు. ఈ చిత్రంతో హీరోయిన్ కృతి శెట్టి, హీరో వైష్ణవ్ తేజ్ తో పాటు దర్శకుడు బుచ్చిబాబు ఓవర్ నైట్ స్టార్స్ అయ్యారు. ముఖ్యంగా కృతి శెట్టికి మంచి పునాది వేసింది. ఉప్పెన విజయంతో కృతి శెట్టికి వరుస ఆఫర్స్ వచ్చిపడ్డాయి. ఏకంగా అరడజను సినిమాల వరకు ఆమె సైన్ చేశారు. అలాగే దర్శకుడు బుచ్చిబాబు కోసం కూడా హీరోలు క్యూ కడుతున్నారట.

తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తో బుచ్చిబాబు సినిమా ఫిక్స్ అయింది. 25 KGF లకి సరిపడే స్క్రిప్ట్ రెడీ అయిందంటూ బుచ్చిబాబు ట్విట్టర్ వేదికగా తెలిపాడు. అయితే ఈ సినిమా ఏ బ్యానర్ మీద ఉంటుంది.. అనేదే సస్పెన్స్. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో ఉన్నాడు. కరోనాతో అది లేటు అయి.. ఇంకా సాగుతోంది. దీని తర్వాత త్రివిక్రమ్ తో ఓ సినిమా ఫైనల్ చేశాడు.. అటు కొరటాల శివతోనూ మరో సినిమా ఫైనల్ చేసినట్లు చెబుతున్నారు. బుచ్చిబాబు సినిమా ఉంటే గింటే ఆ రెండిటి తర్వాతే ఉండాలి. మరెన్నాళ్లు పడుతుందో చూడాలి. బహుశా 2023లో బుచ్చిబాబు సినిమా తెరకెక్కే ఛాన్స్ ఉన్నట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.

కాగా ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. జనవరి 7న విడుదల కావాల్సిన ఈ మూవీ కరోనా వ్యాప్తి కారణంగా ముచ్చటగా మూడోసారి వాయిదా పడింది. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్టీఆర్ కొమరం భీమ్ రోల్ చేస్తుండగా… చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్నారు. ఇటీవలే విడుదలపై క్లారిటీ ఇచ్చారు. మార్చ్, ఏప్రిల్ నెలల్లో రెండు విడుదల తేదీలు ప్రకటించారు.