ఏపీలో కరోనా కల్లోలం కాస్త తగ్గింది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడం కలకలం రేపుతుండగా తాజాగా కేసుల సంఖ్య తగ్గడం ఊరట కలిగిస్తుంది. తాజాగా ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 39296 శాంపిల్స్ పరీక్షించగా 10,310 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది.
అలాగే ఒక్కరోజు వ్యవధిలో మరో 12 మంది కరోనా బారిన పడి మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,16,031 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 9,692 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. నేటి వరకు రాష్ట్రంలో 3,24,45,428 శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.
కాగా గడిచిన 24 గంటల్లో జిల్లాల వారీగా కేసులు ఈ విధంగా ఉన్నాయి.
అనంతపురం 99
చిత్తూరు 411
ఈస్ట్ గోదావరి 910
గుంటూరు 1249
వైస్సార్ కడప 1697
కృష్ణ 1008
కర్నూల్ 1379
నెల్లూరు 927
ప్రకాశం 700
శ్రీకాకుళం 229
విశాఖపట్నం 853
విజయనగరం 222
వెస్ట్ గోదావరి 626