తెలంగాణలో ఫీవర్ సర్వే..వెలుగులోకి షాకింగ్ నిజాలు

Fever survey in Telangana..shocking facts in the light

0
109

ప్ర‌స్తుతం ఏ ఇంట్లో చూసిన జ్వ‌రం, జలుబు, దగ్గుతో బాధ‌ప‌డుతున్న వారు కనిపిస్తున్నారు.  అయితే ఒక్క‌సారిగా వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డ‌డంతో సీజ‌న‌ల్ వ్యాధులు పెరిగాయి. జ్వ‌రాలకు కూడా ఇదే కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు. అయితే తమకు వచ్చింది సీజనల్ వ్యాధా లేకుంటే కరోనాన అనే సందేహం ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తుంది. ఈ మేరకు సర్కార్ వారం రోజుల క్రితం ఫీవర్ సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ జ్వర సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

కేవలం 9 రోజుల వ్యవధిలోనే మొత్తం 4,00,283 మందిలో కొవిడ్‌ లక్షణాలున్నట్లు గుర్తించారు. మొత్తం 90 లక్షల పైచిలుకు ఇళ్లలోనూ, ఆసుపత్రి ఓపీల్లో మరో 6.58 లక్షల మందిని పరిశీలించగా పై విషయం నిర్ధారణ అయింది. వైరస్‌ నిర్ధారణ కాకపోయినా.. 3,97,898 మందికి ఔషధ కిట్లు అందజేశారు. ఈనెల 21 నుంచి 29 వరకు నిర్వహించిన ఫీవర్ సర్వే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవల ద్వారా స్పష్టమైంది.  ప్రస్తుతం ప్రతీ ఇంటిలో కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నవారు ఉన్నారు. అయితే కోవిడ్ వ్యాధిపై అవగాహన రావడంతో చాలా మంది ప్రజలు టెస్టులకు దూరంగా ఉన్నారు. దీంతో ఇంట్లో ఉంటూనే.. మెడిసిన్స్ వాడుతున్నారు. అయితే కోవిడ్ నిర్థారణ కాకపోయినా… 3,97,898 మందికి మందులు కిట్లు అందచేసినట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

ఇంటింటి జ్వర సర్వే ద్వారా సత్ఫలితాలు వస్తున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. లక్షణాలు కనిపించిన వెంటనే మందుల కిట్లు ఇవ్వడం వల్ల అత్యధికుల్లో ఆరోగ్యం కుదుటపడుతోంది. ప్రజల్లోనూ అప్రమత్తత పెరిగింది. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స పొందుతున్నారు. ఫలితంగా శ్వాసకోశాల్లో తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌, నిమోనియా వంటి సమస్యలు లేవని వైద్యులు చెబుతున్నారు. గతంలో సీజనల్‌గా చేరే శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌ కేసుల సంఖ్యతో పోల్చితే.. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో అలాంటి రోగుల చేరికలు బాగా తగ్గాయని వైద్యవర్గాలు విశ్లేషించాయి.