బాబా మాస్టర్ డైరెక్షన్ కుమ్మెశారు.. ఎక్కడ? ఎందుకంటే ?

బాబా మాస్టర్ డైరెక్షన్ కుమ్మెశారు.. ఎక్కడ? ఎందుకంటే ?

0
88

తెలుగు బిగ్ బాస్ 3 హౌస్‌లో ప్రేక్షకులకీ వినోదం తో పాటు, కొన్ని షాకులు కూడా తగులుతున్నాయి. అయితే వారం వారం బిగ్ బాస్ హౌస్‌లో ఏదో ఒక టాస్క్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ వారం బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి చలో ఇండియా అనే టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా ముంబై చేరుకోగానే ఇంటి కంటెస్టెంటెన్స్ కి ‘ స్టార్ట్ కెమెరా.. యాక్షన్ ’ అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్‌లో భాగంగా ఐదు నిమిషాల నిడివితో వీడియోను తీయాలన్నారు. ఇందులో లవ్, రొమాన్స్, యాక్షన్ ఎమోషన్స్ ఉండాలన్నారు. ఈ టాస్క్లో బాబా భాస్కర్ దర్శకుడిగా తన ప్రతిభని బయటపెట్టాడు.

ఇకపోతే గతంలో తమిళ్ లో డైరెక్షన్ చేసాడు బాబా భాస్కర్. ఆ అనుభమే ఇప్పుడు ఈ ఎర్రగడ్డ లవ్ స్టోరీ ని తీయడానికి ఉపయోగపడింది. టాస్క్ కంప్లీట్ అయ్యాక హౌస్ మేట్స్ బిగ్‌బాస్ హౌస్లో వారంందరూ బాబా మాస్టర దర్శకత్వంపై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్ళాక మళ్ళీ దర్శకత్వం చేయాలని బాబా మాస్టర్‌కి సలహాలు కూడా ఇచ్చారు.

ఇప్పటికే కొరియోగ్రాఫర్గా మంచి పేరు తెచ్చుకున్నాడు బాబా భాస్కర్.. మరి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో చేసిన డైరెక్షన్ మెచ్చి ఏ హీరో అయినా ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి మరి. ఏదేమైనా బాబా మాత్రం డైరెక్షన్ కుమ్మేసాడు. బాబా డైరెక్షన్ నిజంగా సినిమాల అనిపించిందని అందరూ మెచ్చుకున్నారు. ఇక ఈ టాస్క్‌లో కెమెరా మ్యాన్‌గా వరుణ్, అసిస్టెంట్ డైరెక్టర్‌గా రాహుల్, నటినటులుగా శ్రీముఖి, హిమజ, రవి, అలీ, మహేష్ ఉన్నారు.