Flash: బడ్జెట్ అప్ డేట్స్- LICపై కీలక ప్రకటన

0
60

2022-23 కేంద్ర బడ్జెట్ కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీనితో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది నాలుగోసారి. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ మాట్లాడుతూ… కరోనా కట్టడి లో వ్యాక్సినేషన్ బాగా కలిసి వచ్చిందని.. ప్రజల ప్రాణాలు కాపాడటం టీకా బాగా పని చేసిందని తెలిపారు.

ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ఎల్ఐసి పబ్లిక్ ఇష్యూ రాబోతుందని తెలిపారు. నేషనల్ హైవేస్ నెట్వర్క్ను 25 వేల కిలోమీటర్లు పెంచుతామని స్పష్టం చేశారు. వృద్ధిరేటు లక్ష్యాన్ని 9.2 శాతం అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు 20 వేల కోట్లు సమీకరిస్తున్నామని ప్రకటన చేశారు.