2022-23 కోసం కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. వరుసగా నాల్గోసారి ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా నిరుపేదలకు ఆమె శుభవార్త చెప్పారు. పీఎం ఆవాస యోజన పథకం కింద నిరుపేదలకు ఏకంగా 80 లక్షల ఇండ్లను నిర్మిస్తామని ప్రకటన చేశారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.48,000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.