ఏపీ కరోనా అప్డేట్: కొత్తగా 6,213 కేసులు నమోదు..మరణాలు ఎన్నంటే?

AP Corona Update: 6,213 new cases registered

0
77

ఏపీలో కరోనా కల్లోలం కాస్త తగ్గింది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడం కలకలం రేపుతుండగా తాజాగా కేసుల సంఖ్య తగ్గడం భారీ ఊరట కలిగిస్తుంది. తాజాగా ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 6,213 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 22,82,583 చేరింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది.

అలాగే ఒక్కరోజు వ్యవధిలో కోవిడ్ వల్ల చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నంలో ఒక్కొక్క రు చొప్పున మరణించారు. ఇక గడిచిన 24 గంటల్లో 10,795 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు.  నేటి వరకు రాష్ట్రంలో 3,25,05,747 శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.

కాగా గడిచిన 24 గంటల్లో జిల్లాల వారీగా కేసులు ఈ విధంగా ఉన్నాయి.

అనంతపురం  308

చిత్తూరు         228

ఈస్ట్ గోదావరి   731

గుంటూరు  830

వైస్సార్ కడప  462

కృష్ణ   903

కర్నూల్  679

నెల్లూరు   307

ప్రకాశం    324

శ్రీకాకుళం 195

విశాఖపట్నం  518

విజయనగరం 86

వెస్ట్ గోదావరి   642