ఆ ఇద్దరూ తగ్గరండోయ్

ఆ ఇద్దరూ తగ్గరండోయ్

0
91

ఇండస్ట్రీలో ఏదగాలంటే మంచి అవకాశం రావాలి. ఒక వేళ వచ్చిన అది హిట్ అయితే ఓకే. లేదంటే మరి ఆ నటివునుల పరిస్థితి అంతే. అందుకని చాలా మంది హీరోయిన్లు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఈ మధ్య కాలంలో సినిమా అవకాశాలు చాల తక్కువ. మరి అలంటి టైములో ఒక్క సినిమా హిట్ అయితే వెంటనే మన నటివునులు రెమ్యూనరేషన్ పెంచేయడం కామన్ అయిపోయింది.

ఇప్పుడు అదే కోవలో మన ఇస్మార్ట్ శంకర్ తో హిట్ అందుకున్న నభానటేష్, నిధి అగర్వాల్ లు కూడా చేరారు. ఇస్మార్ట్ శంకర్ హిట్ కావడంతో ఈ భామాలకు మంచి అవకాశాలు వస్తున్నాయట దాంతో వారు తమ పారితోషికాలు అమాంతం పెంచేసినట్లు తెలుస్తోంది.వీరిద్దరూ ఒకే మాట మీద ఉండి కొత్త ఆఫర్ వస్తే ఎనభై లక్షలు కోట్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

అయినా హీరోయిన్లు చెప్పినంత మాత్రాన మన నిర్మతలు ఇచ్చేస్తారా ఏంటి వారితో బేరాలు అడారు. అదే జరిగింది ఇక్కడ రీసెంట్ గా నిధి ఓ సినిమా కోసం 80 లక్షలు అడిగితే బేరాలు చేసిన తరువాత 50 లక్షలకు ఒప్పుకుందట. అలాగే నభా కూడా 80 వరకు చెప్పి చివరాకరికి యాభైకి ఒప్పుకుంటున్నట్లు సమాచారం. అసలే హీరోయిన్స్ కి మంచి పోటీ ఉన్న టైములో ఈ మాత్రం తగ్గకపోతే అవకాశాలు అసలు రావు అని వీరికి అర్ధం అయిపోయినట్టు ఉంది. వాళ్ల కేరీర్‌ను ఎలా మందుకు తీసుకువెళ్లాలనే ఆలోచన బాగే ఉంది ఈ నటివునులకు.