నిరుద్యోగులకు శుభవార్త..ఈ నెలలోనే 50 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్​!

Good news for the unemployed..Notification for the replacement of 50 thousand jobs within this month!

0
86

50 వేల ఉద్యోగాల భర్తీ అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించి సంవత్సరం అయింది. కానీ ఇప్పటికి కొలువుల భర్తీ కొలిక్కి రాలేదు. కొత్త జోనల్‌ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తయ్యాక నియామకాలు చేపడతామని కేసీఆర్‌ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. కొత్త స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన, కేటాయింపులు పూర్తిచేసి అందుకు అనుగుణంగా బదిలీలు కూడా చేశారు. ఆ ప్రక్రియ దాదాపుగా పూర్తి అయినట్లేనని తెలుస్తోంది.

స్పౌస్ కేసులు, అప్పీళ్లకు సంబంధించి అతి స్వల్ప సంఖ్యలో మాత్రమే దరఖాస్తులు మిగిలినట్లు సమాచారం. అవి కూడా నేడో, రేపో పూర్తికానున్నాయి. తాజాగా పరస్పర బదిలీలకు కూడా సర్కార్ మార్గదర్శకాలు జారీ చేసింది. గతంలో శాఖలు ఇచ్చిన ఖాళీల వివరాలను ఉద్యోగుల విభజన అనంతరం ఏర్పడిన ఖాళీలతో అధికారులు సరి చూస్తున్నారు. దీనితో ఖాళీల భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది.

50 వేలకు పైగా ఖాళీల భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరగా నోటిఫికేషన్లు ఇచ్చేలా నియామకాలకు సంబంధించిన కసరత్తు పూర్తిచేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో సంబంధిత అంశాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెలలోనే కొన్ని నోటిఫికేషన్లు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.