ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతుంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడం కలకలం రేపుతున్నాయి. తాజాగా ఏపీ వ్యాప్తంగా 30,578 కరోనా పరీక్షలు చేయగా.. కేవలం కొత్తగా 4605 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది. కోవిడ్ వల్ల అనంతపురం, కడప. కర్నూలులలో ఇద్దరు, చిత్తూరు, గుంటూరు, ప్రకాశం మరియు విజయనగరంలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
దీంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 641 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 93488 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 11,729 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2185042 లక్షలకు చేరింది. ఇప్పటి దాకా 3,25,71,365 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
గడిచిన 24 గంటల్లో జిల్లాల వారిగా కేసులు ఈ విధంగా ఉన్నాయి.
అనంతపురం 218
చిత్తూరు 290
ఈస్ట్ గోదావరి 642
గుంటూరు 524
వైస్సార్ కడప 413
కృష్ణ 477
కర్నూల్ 318
నెల్లూరు 501
ప్రకాశం 342
శ్రీకాకుళం 105
విశాఖపట్నం 219
విజయనగరం 17
వెస్ట్ గోదావరి 539