దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పాఠశాలలో పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకొని కేంద్ర విద్యాశాఖ సవరించిన కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. స్కూళ్లలో పరిశుభ్ర వాతావరణం ఉండాలని, పరిసరాల్ని ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలని తెలిపింది. పాఠశాలల్లో పిల్లల మధ్య ఆరు అడుగులు దూరం ఉండేలా సీటింగ్ ఏర్పాటు చేయాలని పేర్కొంది.
విద్యార్థులు, సిబ్బంది అంతా మాస్కులు ధరించాలని పేర్కొంది. హాస్టళ్లలో అన్నివేళలా భౌతికదూరం పాటించడంతో పాటు పిల్లల బెడ్‌ల మధ్య దూరం ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. పిల్లలను స్కూళ్లకు పంపేందుకు వారి తల్లిదండ్రుల సమ్మతిని తీసుకొనేలా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చర్యలు చేపట్టాలని స్పష్టంచేసింది. ఒకవేళ వారు ఆన్ లైన్ తరగతులవైపే మొగ్గుచూపితే అందుకు అనుమతించాలని తెలిపింది.