తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు బిగ్ షాక్..50% అదనపు బాదుడు షురూ!

0
88

ఒకపక్క అప్పులు, మరోవైపు నష్టాలతో ఆర్టీసీ కోలుకునేలా కనిపించడం లేదు. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు వందల కోట్లలో ఉన్నాయి. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు ఆర్టీసీ నానాయాతన పడుతోంది. ఎండీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సజ్జనర్ ఎన్ని దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నా నష్టాలను మాత్రం పూడ్చ లేకపోతున్నారు.

ఈ తరుణంలో ప్రత్యేక బస్సులు అదనపు చార్జీలు వసూలు చేయాలని తెలంగాణ ఆర్టీసీ తాజాగా నిర్ణయం తీసుకుంది. ముచ్చింతల్ లో జరుగుతున్న శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం వేడుకలకు హైదరాబాద్ నగరం నుంచి నడిపే ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేయాలని.. గురువారం ఆర్టీసీ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇవాల్టి నుంచి కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. అలాగే సమ్మక్క-సారలమ్మ జాతరకు ఈ నెల 13 నుంచి నడిపే ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు పై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు.

గత ఏడాది జనవరిలో ఆర్టీసీకి రూ.337.79 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏడాది జనవరిలో ఆ మొత్తం రూ.287.07 కోట్లకే పరిమితమైంది. రూ.51 కోట్ల ఆదాయం తగ్గింది. గత డిసెంబరు ఆదాయం రూ.352.67 కోట్లతో పోల్చినా జనవరిలో రూ.65.55 కోట్ల మేర తగ్గింది.