జర్నలిస్టులకు గుడ్ న్యూస్..పాత జీవో ప్రకారమే అక్రెడిటేషన్లు ఇవ్వాలనే టీయుడబ్ల్యుజె విజ్ఞప్తిపై ఎట్టకేలకు తెలంగాణ సర్కార్ స్పందించింది. పాత జిఓనే కొనసాగించాలని సమాచార శాఖ కమిషనర్ అరవింద్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల చివరి వారానికల్లా దరఖాస్తులను ఆహ్వానించి, మార్చి మొదటి, రెండవ వారం కల్లా అక్రెడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియను పూర్తి చేసేందుకు సమాచార శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. కాగా అక్రెడిటేషన్ జి.ఓను సవరించి జర్నలిస్టులకు అన్యాయనికి గురి చేయవద్దని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.