తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే హుజురాబాద్ లో గెలిచిన బీజేపీకి పార్టీ బలోపేతానికి మరో ముందడుగు పడనుంది. ఈనెల 16న తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో యువ తెలంగాణ పార్టీ బీజేపీలో వీలీనం కానుంది. యువ తెలంగాణలోని ముఖ్య నాయకులు జిట్టా బాలక్రిష్ణా రెడ్డి, రాణి రుద్రమలు కాషాయ కండువా కప్పుకోనున్నారు.