టాలీవుడ్ ను కరోనా మహమ్మారి వదలడం లేదు. ఇప్పటికే వరుసగా పలువురు నటి నటులు ఈ మహమ్మారి బారిన పడగ తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటి, మాజీ పార్లమెంటు సభ్యురాలు జయసుధ కూడా కరోనా సోకింది. ఇవాళ నిర్వహించిన పరీక్షల్లో ఆమెకు కరోనా సోకింది. దీంతో నటి జయసుధ హోమ్ క్వారంటైన్ లోకి వెళ్ళింది. ఈ విషయాన్ని స్వయంగా నటి జయసుధ తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.