రైతులకు అలర్ట్..ఉల్లిని పండిస్తున్నారా? ఎక్కువ రోజులు నిల్వ చేయండిలా..

Should onions be stored longer? But do it like this ..

0
142

దేశానికి అన్నం పెట్టె రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. భూమిని సాగు చేసేటప్పడి నుండి మొదలుపెడితే పండిన పంటను అమ్మే వరకు నానా తంటాలు పడాల్సి వస్తుంది. అయితే రైతులు గిట్టుబాటు ధర లేక పంటనునిల్వ చేసుకోడానికి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మిర్చి,పత్తి మొదలు పల్లికాయ, ఉల్లిపాయలు నిల్వ చేసుకోవాలంటే సరైన నియమాలు పాటించాల్సిందే. ఉల్లిని పండించడం వల్ల చాలా లాభాలు పొందవచ్చు. కానీ లాభాలు పొంద  రైతులు ఉల్లిపాయలను నిల్వ చేయడం ఎంతో అవసరం. అయితే సాధారణంగా ఉల్లి ఎక్కువ కాలం నిల్వ ఉండదు. ఉల్లిపాయలను నిల్వ చేయడం చాలా కష్టతరమైన పని. ఎంత చక్కగా నిల్వ ఉంచడానికి ప్రయత్నించినా కనీసం 10 శాతం పాయలైనా కుళ్లిపోతుంటాయి.

రైతులు అధిక లాభాలను పొందాలంటే పంట కోత కోసిన వెంటనే అమ్మకూడదు.  అయితే  ఉల్లిపాయలని నిల్వ ఉంచుకుని ఆ తర్వాత అమ్ముకుంటే  అదిరిపోయే లాభాలు వస్తాయి.కొన్ని రోజులపాటు నిల్వ ఉంచి అప్పుడు అమ్ముకుంటే ఎక్కువ లాభాలు వస్తాయి.ఉల్లిపాయలు నిల్వ ఉండాలంటే ఇలా చేయండి.   సాధారణంగా రైతులు ఉల్లి నిల్వ చేయడానికి గోన్లని ఉపయోగిస్తారు. ఉల్లిపాయల్ని గోను సంచుల్లో వేసి స్టోర్ చేస్తారు. అయితే ఖర్చు లేకుండా ఒక రైతు మాత్రం మంచి

దీంతో ఉల్లిపాయలు సమర్థవంతంగా నెలల పాటు నిల్వ ఉంటాయి. ఉల్లి సాగు చేస్తున్నప్పుడు ఈ రైతు వరిదుబ్బలని కోయించి వాటిని వరుసల మధ్య పేర్చి మల్చింగ్ లా వినియోగిస్తున్నారు. దీనివల్ల సాగునీటి కొరతకు పరిష్కారం లభిస్తుంది. అయితే ఈయన గోను సంచుల్లో నిల్వ చేయకుండా ఉల్లి కోత తర్వాత కాడలతో సహా దానిని తీసుకువెళ్లి కట్టేసి వేలాడ తీస్తున్నారు. ఇలా చేయడం వల్ల గాలి తగిలి ఉల్లిగడ్డలు కుళ్ళి పోకుండా ఉంటాయి. ఇలా చేస్తే మూడు నుండి నాలుగు నెలల పాటు ఉల్లిపాయలు కుళ్ళిపోకుండా నిల్వ ఉంటాయి.