Breaking: ఇంట‌ర్ ప‌రీక్షల‌పై తెలంగాణ విద్యాశాఖ కీల‌క ప్ర‌క‌ట‌న

Telangana Education Department's key announcement on inter examinations

0
135
AP Inter exams Schedule

తెలంగాణ విద్యాశాఖ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. క‌రోనా వైరస్ వ్యాప్తి త‌గ్గ‌డంతో ఇంట‌ర్ ప‌రీక్షల‌ను నిర్వహించాలని నిర్ణ‌యం తీసుకుంది. అంతేకాకుండా ఇంట‌ర్ ప్ర‌ధాన ప‌రీక్షల‌కు సంబంధించి షెడ్యూల‌ను కూడా రాష్ట్ర విద్యా శాఖ విడుద‌ల చేసింది.

విద్యాశాఖ విడుదల చేసిన షెడ్యూల్ ప్ర‌కారం ఏప్రిల్ 20వ తేదీ నుంచి మే 5వ తేదీ వ‌ర‌కు ఇంట‌ర్ ప్ర‌ధాన ప‌రీక్షలు నిర్వ‌హిస్తారు. అలాగే మే 6 నుంచి 9 తేదీల‌లో మైన‌ర్ ప‌రీక్షలు నిర్వ‌హిస్తారు. అలాగే మార్చి 23 వ తేదీ నుంచి ఏప్రిల్ 8 వ తేదీ వ‌ర‌కు ఇంట‌ర్ ప్రాక్టికల్ ప‌రీక్షలను నిర్వ‌హిస్తారు. అనంత‌రం ఏప్రిల్ 11 వ తేదీన ఎథిక్స్ అండ్ హుమన్ వాల్యూస్ పరీక్షల‌ను నిర్వ‌హిస్తారు. దీని త‌ర్వాత అంటే ఏప్రిల్ 12వ తేదీన ప‌ర్యావ‌ర‌ణకు సంబంధించిన ప‌రీక్షను నిర్వహించనున్నారు.