సామాన్యులకు బిగ్ షాక్..సొంతిటి కల మరింత ప్రియం కానుంది. పెరుగుతున్న ధరలతో సగటు సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే అప్పుల పాలు కావలసి వస్తుంది. అందుకేనేమో ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ఇప్పటికే ఇంటి నిర్మాణానికి అవసమయ్యే ఐరన్, ఇసుక ఇలా అన్నింటి ధరలు పెరిగాయి. తాజాగా సిమెంట్ ధరలు భారీగా పెరిగాయి.
తాజాగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సిమెంట్ ధరలు భారీగా పెరిగాయి. ఈనెల 1 నుంచి సిమెంట్ బస్తాపై రూ. 20 నుంచి రూ. 50 వరకు పెరిగింది. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 50 కిలోల బస్తా ధర బ్రాండ్ ను బట్టి రూ.310 నుంచి రూ.400 వరకు ఉంది. గతేడాది నవంబర్ వరకు డిమాండ్ తక్కువగా ఉండటంతో కంపెనీలు రేట్లను తగ్గించాయి. ఈ ఏడాది నుంచి డిమాండ్ పెరగడంతో పాటు ముడి పదార్థాల రేట్లు పెరగడంతో ధరలు పెంచడం తప్పట్లేదని కంపెనీలు చెబుతున్నాయి.
గత ఏడాది నవంబర్ వరకు సిమెంట్‌కు డిమాండ్ తక్కువగా ఉండటంతో కంపెనీలు రేట్లను రూ.50 నుంచి రూ.70 వరకు తగ్గించాయి. ఈ ఏడాది జనవరి నుంచి డిమాండ్ పెరగడంతో పాటు ముడి పదార్థాల రేట్లు పెరగడంతో సిమెంట్ ధరలను పెంచినట్లు కంపెనీలు చెబుతున్నాయి. ఇప్పటికే ఇంటి నిర్మాణానికి కీలకమైన ఐరన్ ధరలు భారీగా పెరిగాయి. ఇప్పుడు సిమెంట్ ధరలు కూడా పెరగడంతో ఇంటి నిర్మాణం వ్యయం పెరిగిపోతుంది. దీంతో నిర్మాణ రంగంపైనా ప్రభావం పడుతోంది.