తెలంగాణలోని గంగదేవిపల్లి గుప్తనిధుల విషయం ఇప్పుడు అందరి నోట నానుతుంది. పెద్ద ఎత్తున బంగారం లభ్యమైందని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మరొక ఏడుగురు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతుండగా 30 రాగి నాణాలు బయటపడ్డాయి. వాటిని విక్రయించేందుకు వెళుతుండగా వారిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఓ ఆడియో టేప్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ తవ్వకాల్లో పెద్ద ఎత్తున బంగారు బిళ్లలు దొరికినట్టు గీసుకొండకు చెందిన ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్న ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2021 డిసెంబర్ 24న గుప్త నిదులు గుర్తించి బయటికి తీసినట్టు వారి మాటలను బట్టి అర్థమవుతుంది.
2021 డిసెంబర్ 24న గుప్త నిదులు గుర్తించి బయటికి తీసినట్టు వారి మాటలను బట్టి అర్థమవుతుంది. ముఖ్యంగా నలుగురు మిగతా వారి కళ్లను కప్పి బంగారం పెట్టేను మాయ చేశారు. గుప్తనిధులను బయటికి తీసేందుకు ఓ కోడేను బలిచ్చేందుకు సిద్ధం అయ్యారు అని స్పష్టం చేసారు. కేవలం రాగి నాణేలు మాత్రమే లభించాయని పోలీసులు చెబుతున్నారు. ఇందులో ఏది నిజమో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడక తప్పదు.