Big Breaking: తెలంగాణలో ముగిసిన కరోనా థర్డ్‌ వేవ్‌..ఆంక్షలు ఎత్తివేత

0
68

కరోనా కేసులపై తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాసరావు సంచలన ప్రకటన చేశారు. కోవిడ్ మూడో వేవ్ తెలంగాణలో జనవరి 28కి భారీగా పెరిగింది. కానీ ఆ తరవాత తగ్గుతూ వచ్చిందన్నారు. ఇప్పుడు పాజిటివిటీ రేట్ తగ్గింది. తెలంగాణలో 2 శాతంలోపే పాజిటివిటీ రేటు ఉందని చెప్పారు. ఈ లెక్కన తెలంగాణలో థర్డ్‌ వేవ్ ముగిసినట్టేనని ఆయన ప్రకటన చేశారు. మరో వారంలోగా కేసుల నమోదు పడిపోయే అవకాశం ఉందని, దీనితో తెలంగాణలో కరోనా ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు పేర్కొన్నారు.