అపర కుబేరుడిగా అదానీ..రెండో స్థానంలో అంబానీ

0
92

అదానీ గ్రూప్​ సంస్థల అధినేత గౌతమ్ అదానీ మరో ఘనతను సాధించారు. అదాని గ్రూప్ ఛైర్మన్ గా ఉన్న గౌతం అదానీ ఆసియాలోనే అపరకుబేరుడిగా అవతరించినట్లు బ్లూమ్ బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ వెల్లడించించి. రెండోస్థానంలో ముఖేష్ అంబానీ నిలిచారు. బ్లూమ్ బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ జాబితాలో ప్రపంచంలోనే 10వ స్థానంలో అదానీ, 11 స్థానంలో అంబానీ నిలిచారు.

ఎవరి సంపద ఎంతంటే..
బ్లూమ్​బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్​ ప్రకారం.. సోమవారం నాటికి గౌతమ్ అదానీ మొత్తం సంపద విలువ 88.5 బిలియన్ డాలర్ల (రూ.6.6 లక్షల కోట్లకు పైమాటే)కు పెరిగింది. ఇదే సమయంలో ముకేశ్ అంబానీ సంపద విలువ రూ.87.9 బిలియన్​ డాలర్లు (రూ.6.2 లక్షల కోట్ల పైమాటే) గా ఉంది.

మరో విశేషమేమిటంటే.. ప్రపంచవ్యాప్తంగా 2022లో ఇప్పటి వరకు అత్యధికంగా సంపద పెరిగిన వ్యక్తి కూడా గౌతమ్​ అదానీనే అని బ్లూమ్​బర్గ్​ పేర్కొంది. ఈ ఏడాది ఇప్పటి వరకు అదానీ సంపద 12 బిలియన్ డాలర్లు (రూ.89 వేల కోట్లకన్నా ఎక్కువే) పెరిగింది. పోర్టులు, విమాశ్రయాలు, ఇంధన రంగాల్లో అదానీ ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తుండటం