గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుంది. ఈ రాకాసి నుండి ఎప్పుడు బయటపడతామా అని యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది. కొద్ది రోజులుగా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. కొత్త వేరియంట్ల ముప్పు ఇంకా తొలగిపోలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కరోనా మహమ్మారి ప్రభావం దశాబ్దాల పాటు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) తాజాగా హెచ్చరించింది.