మంత్రి కేటీఆర్ పై వైయస్ షర్మిల ఫైర్

Yves Sharmila fires on Minister KTR

0
81

తెలంగాణ మంత్రి కేటీఆర్ పై వైయస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి కేటీఆర్ ఇలాక సిరిసిల్లలోనిన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పై గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. తనకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు రాలేదని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఈ సంఘటనపై వైఎస్ షర్మిల కేటీఆర్ పై ఫైర్ అయ్యారు.

“నిన్న ఇండ్లల్ల పనులు చేసుకుంటూ, దివ్యాంగుడైన భర్తను, ఇద్దరు పిల్లలను పోషించుకునే మహిళకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కావాలంటే తాళి బొట్టు నమ్మి మరీ లక్ష రూపాయల లంచం ఇవ్వాలని అడిగిన అధికార్లకు సిగ్గుండాలి. మీకు జీతాలు వస్తలేవా లేక సరిపోతలేవా యథా మంత్రి తథా అధికారులు. తలదించుకో KTR” అంటూ ఫైర్ అయ్యారు షర్మిల.