విలీనం నుంచి విభజన దాకా..అసలు తెలంగాణ ఎలా ఏర్పడిందంటే?

0
114
Telangana Formation

ప్రతి తెలంగాణ పౌరుడు తప్పక చదవండి

తెలంగాణ రాష్ట్రం ఏపీ నుంచి ఏర్పడలేదు. అసలు చరిత్ర అందరూ తెలుసుకోండి లేదా గుర్తు తెచ్చుకోండి. తెలంగాణ రాష్ట్రం బలవంతంగా ఏర్పాటు చేయబడిందని పార్లమెంటులో పదేపదే చర్చలు వస్తున్న నేపథ్యంలో నా ఈ చిరు వ్యాసం ద్వారా అసలు నిజం మీ కోసం..

ఇండియాకు 15.08.1947 నాడు స్వాతంత్య్రం వచ్చినపుడు హైదరాబాద్ దేశానికి (సంస్థానానికి) స్వాతంత్రం ఇంకా రాలేదు. నాడు ఇండియన్ ఆర్మీ సైనిక దాడి తర్వాత తేదీ 17.09.1948 నైజాం ప్రభువు హైదరాబాద్ దేశాన్ని ఇండియాలో విలీనం చేశాడు. అలా హైదరాబాద్ (తెలంగాణ) ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. 31.10.1956 వరకు హైదరాబాద్ రాష్ట్రంగానే కొనసాగింది. ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా పని చేశారు. తేదీ 01.11.1956 న భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు పెద్ద మనుషుల ఒప్పందం చేసి హైదరాబాద్ రాష్ట్రాన్ని బలవంతంగా (మద్రాస్ నుంచి విభజించిన) ఆంధ్రరాష్ట్రంలో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందే హైదరాబాద్ అనగా మన తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రం పేరుతో ప్రత్యేకంగా ఉంది.

పెద్దమనుషుల ఒప్పందం బేఖాతరు చేయడం, తెలంగాణ వారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం, నీళ్లు నిధులు నియామకాలు ఆంధ్ర వారి దోపిడి చేయడంతో సుదీర్ఘ పోరాటం చేసి బలవంతంగా ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేయబడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని 8 సంవత్సరాల క్రితం ప్రత్యేకంగా మళ్లీ విభజించడం జరిగిందే తప్ప కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయబడలేదు. ఈ విషయాన్ని మర్చిపోయి అటు కేంద్రంలో ఇటు ఆంధ్ర వాళ్ళు తప్పుడు వాదనలు చేస్తు..చరిత్రను, తెలంగాణ ప్రజలను యువతను తప్పుదారి పట్టిస్తున్నారు. మన రాష్ట్రం ఏర్పాటు చేసేటప్పుడు అసలు చర్చలు జరగలేదని బలవంతంగా విభజించారని పార్లమెంట్లో కేంద్ర మాట్లాడుతోంది. ఇది పూర్తిగా అవాస్తవం, అన్ని రాజకీయ పార్టీలు లేఖలు ఇచ్చాకే ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు 9 డిసెంబర్ 2009న ప్రకటించారు.

శ్రీకృష్ణ కమిటీ పేరుతో సంవత్సరానికి పైగా సామాన్యుడి నుంచి మొదలుకొని అన్ని రాజకీయ పార్టీలతో విస్తృతంగా చర్చలు జరిపారు. తర్వాత 02.06.2014 నుండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. అంటే నాలుగు సంవత్సరాలకు పైగా విస్తృత చర్చోప చర్చలు జరిపిన తర్వాతనే బలవంతంగా విలీనం చేయబడ్డ మా రాష్ట్రాన్ని 2014 లో బంధ విముక్తి చేశారు. అంతే తప్ప ఏపీ నుంచి మా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలేదు. తెలంగాణ ఏర్పాటు ఎవరి బిక్ష కాదు ఇది మా హక్కు గట్టిగా మాట్లాడితే కాశ్మీర్ కన్నా ముందుగా మేమే స్వతంత్ర దేశంగా కోరే హక్కు కూడా కలిగి ఉన్నాము కానీ భారత జాతి సమైక్యతకు కట్టుబడి ఇందులో ఒక రాష్ట్రంగా కొనసాగుతూ భారతదేశాన్ని గౌరవిస్తున్న గొప్ప పౌరులుగా తెలంగాణ వాసులు గర్వించాలి.

ఇకనైనా దొంగ నాటకాలు ఆపండి..
తెలంగాణ ప్రజానీకం, యువత ఇకనైనా మన ప్రత్యేకతను అందరూ తెలుసుకోవాలని నా ఈ పోస్ట్ ద్వారా చిరు ప్రయత్నం చేశాను. విస్తృతంగా షేర్ చేయండి ఇంకా ఎవరికైనా మూర్ఖులకు అనుమానం ఉంటే గూగుల్ వికీపీడియా లో సెర్చ్ చేయండి. ఎందుకంటే నిజాలను మనం చెప్పే కన్నా పరాయివాడు చెబితేనే తొందరగా నమ్ముతాం. అదే కదా మన దౌర్భాగ్యం..

ఇట్లు
కుంట గంగాధర్ రెడ్డి
రాష్ట్ర అధ్యక్షులు
తెలంగాణ ఐకెపి SERP ఉద్యోగుల సంఘం