టీడీపీ నేతల హౌస్ అరెస్టు దుర్మార్గం: టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు

0
72

టీడీపీ నేతల హౌస్ అరెస్టులు దుర్మార్గం అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. వైసీపీ పాలనలో ప్రజల్ని కన్నింగ్ చేయటం, గనుల్లో మైనింగ్ చేయటం తప్ప రాష్ట్ర అభివృద్ది శూన్యం అని ఎద్దేవా చేశారు. గుంటూరు సుద్దపల్లిలో ‎అక్రమ మైనింగ్ కి వ్యతిరేకంగా దీక్ష చేస్తున్న దూళిపాళ్ల నరేంద్రకు మద్దుతు తెలిపేందుకు వెళ్తున్న టీడీపీ నేతల హౌస్ అరెస్టులు చేయడం దుర్మార్గం.

టీడీపీ నేతల్ని చూసి ముఖ్యమంత్రి ఫిబ్రవరి నెలలోనూ చలితో ఎందుకు వణికిపోతున్నారు. వైసీపీ నేతల బండారం బయటపడుతుందనే టీడీపీ నేతల్ని ఇంట్లో నుంచి ‎బయటకు రానివ్వటం లేదు. హౌస్ అరెస్టులతో మీ అక్రమాల్ని, అవినీతిని కప్పి పుచ్చుకోవాలనుకోవటం అవివేకం. హౌస్ అరెస్టులు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి. అక్రమైనింగ్ పై విచారణ జరిపి నిజాలు ప్రజలకు చెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.