దేశంలో కరోనా థర్డ్ వేవ్ ఒక్క సారిగా తగ్గిపోయింది. ఇప్పటివరకు లక్షల్లో కేసులు నమోదు కాగా తాజాగా కేసులు భారీగా తగ్గిపోయాయి. ఇక గడిచిన 24 గంటల్లో దేశంలో 67084 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,24,78,060 కు చేరింది. కేంద్ర ఈ మేరకు ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
ఇక దేశంలో తాజాగా 1241 మంది కరోనాతో మరణించగా మృతుల సంఖ్య 5,06,520 కి చేరింది. ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 7,90,789 కు చేరింది. ఇక దేశంలో కరోనా పాజిటివిటి రేటు 96.62 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,67,882 మంది కరోనా నుంచి కోలు కున్నారు.
మొత్తం కేసులు: 4,24,78,060
మొత్తం మరణాలు: 5,06,520
యాక్టివ్ కేసులు: 7,90,789
మొత్తం కోలుకున్నవారు: 4,11,80,751