Breaking: ఏపీ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

0
71
AP Inter exams Schedule

ఏపీ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ రిలీజ్ అయింది. పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షల షెడ్యూల్‌ ను ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ కాసేపటి క్రితమే విడుదల చేశారు. మే 2వ తేదీ నుంచి మే 13వ తేదీ వరకు టెన్త్‌ క్లాస్‌ ఆన్వల్‌ పరీక్షలు జరుగనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటన చేశారు. అలాగే.. ఏప్రిల్‌ 8 వ తేదీ నుంచి ఏప్రిల్‌ 28 వ తేదీ వరకు ఇంటర్మీడియట్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.