గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ మెంబెర్షిప్ సమీక్షలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమీక్షలో రేవంత్ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మపై నిప్పులు చెరిగారు. అస్సాం బీజేపీ ముఖ్యమంత్రి డీఎన్ఏ చైనాదా…? అస్సాందా..? అంటూ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీని మాత్రమే అవమానించలేదని..ఓ తల్లిని అవమానించాడని ఆయన విమర్శించారు. నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలు ఈ వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నారా.. లేకపోతే ఈ వ్యాఖ్యలు చేసిన హిమంత బిశ్వ శర్మపై చర్యలు తీసుకుంటారా.. అని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాగా అస్సాం ముఖ్యమంత్రి రాహుల్ గాంధీని నువ్వు ఏ అయ్యకు పుట్టినవో అని అడిగినమా అంటూ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.