“DJ టిల్లు” మూవీ హీరోయిన్ ఇంట తీవ్ర విషాదం

0
77

టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన తాజా మూవీ డీజే టిల్లు. అట్లే ఉంటది మనతోనే అనేది ఈ సినిమాకు ట్యాగ్ లైన్. ఈ సినిమా సూపర్ టాక్ తో దూసుకెళ్తుంది. అయితే ఈ ఆనందాన్ని ఆస్వాదించే లోపే నేహా శెట్టి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. డీజే టిల్లు రిలీజ్ అవ్వడానికి రెండు రోజుల ముందు ఆమె నానమ్మ మృతి చెందింది. ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేసింది నేహా శెట్టి.

“నా అభిమాని నన్ను వదిలి వెళ్ళిపోయింది. నేను రెండు సంవత్సరాల వయసులో ఉన్నప్పటి నుంచే నా నటన చూసేందుకు అవ్వ ఎప్పుడూ ముందువరుసలో కూర్చునేది. అలాంటి అవ్వ ఇప్పుడు నా జీవితంలో సంతోషం లో పాలు పంచుకునేందుకు ఇక లేరని తలచుకుంటే నా హృదయం చలించిపోతుంది. ఐ లవ్ యు డి జే టిల్లు విజయం నీకు అంకితం చేస్తున్నా. “అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.