నేటి నుంచి ఆఫ్ లైన్ లో తిరుప‌తి స‌ర్వ‌ద‌ర్శ‌నం టికెట్లు

Tirupati tour tickets offline from today

0
108

తిరుమల భక్తులకు శుభవార్త. శ్రీవారి స‌ర్వ ద‌ర్శ‌నం టికెట్ల‌ను నేటి నుంచి ఆఫ్ లైన్ లోనే జారీ చేయ‌నుంది టీటీడీ. అందుకోసం అన్ని ఏర్పాట్ల‌ను టీటీడీ సిద్ధం చేసింది. ఉద‌యం 9 గంట‌ల నుంచే ఆఫ్ లైన్ ద్వారా స‌ర్వ ద‌ర్శ‌నం టికెట్ల‌ను జారీ చేయ‌నుంది. అయితే దేశ వ్యాప్తంగా థ‌ర్డ్ వేవ్ విజృంభించిన నేప‌థ్యంలో ఇప్ప‌టి వ‌ర‌కు స‌ర్వ ద‌ర్శనం టికెట్లు కూడా ఆన్ లైన్ లోనే టీటీడీ విడుద‌ల చేసింది. కరోనా విజృంభణ తగ్గడంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.

ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో రోజు15 వేల టోకెన్లు జారీ చేసేందుకు టీటీడీ సిద్ధమైంది. దీంతో నిత్యం శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య 40 వేలు దాటి పోయే అవకాశం ఉంది. 16వ తేదీన శ్రీవారిని దర్శించుకోవాలి అనుకునే వారు.. ఒఖ రోజు ముందుగానే టోకెన్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లతో పాటు.. ఉదయాస్తమాన సేవ టికెట్ల బుకింగ్‌ డోనేషన్‌ విండోను ఈ నెల 16న అందుబాటులోకి రానుంది టీటీడీ.

శుక్రవారం రోజుకు ఒక టికెట్‌కు రూ.1.50 కోట్లు, మిగిలిన రోజులకు ఒక టికెట్‌కు రూ.కోటిగా టికెట్‌ ధరను నిర్ణయించారు. టికెట్ల బుకింగ్‌ కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. ఈ ఉదయాస్తమాన సేవ టికెట్ ధఆర భారీగా ఉండటంతో సామాన్య భక్తులు బుక్ చేసుకోలేని పరిస్థితి. ఈ నిధులను తిరుపతిలో చిన్నపిల్లల ఆస్పత్రి నిర్మాణానికి వినియోగించాలని టీటీడీ నిర్ణయించింది.