రేపటి నుంచే మేడారం మహా జాతర..18న కేసీఆర్ రాక

0
110

రేపటి నుంచి మేడారం మహా జాతర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే 50 లక్షలకు పైగా భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించుకోగా… ఈ నాలుగు రోజులు మరో 80 లక్షల మంది దర్శనం చేసుకుంటారు అని అధికారులు చెబుతున్నారు.

భక్తుల తాకిడి నేపథ్యంలో వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రభుత్వం ఏకంగా 75 కోట్లు వెచ్చించి పనులు చేసిన అధికారులు చెబుతున్నారు. వనంలో ఉన్న దేవతలు జనం మధ్యకు వచ్చే సమయం వచ్చేసింది. జంపన్న వాగు జనసంద్రంగా మారిన గడియలు సమర్పించాయి. రేపటినుంచి ఈ జాతర మరింత భక్తులతో నిండిపోయే ఛాన్స్ ఉంది.

ఈ నేపథ్యంలో సమ్మక్క జాతరకు వెళ్లే ప్రయాణికుల కోసం ఏకంగా 35 వందల ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. అలాగే మేడారం ప్రాంతంలో ఏకంగా 6700 మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేశారు అధికారులు. అటు భద్రత కోసం పదివేల మంది పోలీసులు ఉన్నారు. ఇది ఇలా ఉండగా ఈ నెల 18వ తేదీన సీఎం కేసీఆర్ మేడారం జాతరకు వెళ్లనున్నారు.