ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకియా నాయకులు కరోనా బారిన పడ్డారు. తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి కోవిడ్ బారిన పడ్డారు. ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకున్నానని.. తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నట్లు వెల్లడించారు. తనను కలిసిన వారంతా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని సూచించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. కాగా ఆయనకు కరోనా రావడం ఇది రెండోసారి.