జగన్ కు క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు తెరపైకి తల్లి, చెల్లి..!

జగన్ కు క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు తెరపైకి తల్లి, చెల్లి..!

0
100

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవడంలో ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిళ పాత్ర ఎంతో ఉంది. వైఎస్ ఉండగా బయటకు రాని వాళ్ళు జగన్ ను ముఖ్యమంత్రిని చెయ్యడానికి చాలా కష్టపడ్డారు. అయితే జగన్ తో వారి ప్రయాణం చూసిన వారెవరైనా జగన్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలా తెరమిదకు వస్తారని అంటారు. జగన్‌కు బాగా అవసరమైనప్పుడు మాత్రమే వారు తెర మీదకు రావడం వల్ల కొంత విమర్శలు కూడా ఎదురుకున్నారు ముఖ్యమంత్రి జగన్.

ఇది ఇలా ఉండగా నేడు వైఎస్ వర్ధంతి సందర్భంగా వైఎస్ విజయమ్మ సాక్షి టీవీలో స్పెషల్ ఇంటర్వ్యూను ఇచ్చారు. ఎప్పటిలానే ఆమె తన ప్రేమను కురిపించారు. జగన్ బాబు మా బంగారు బాబు అంటూ మమకారం చూపించారు. అలాగే చంద్రబాబు మీద విమర్శలూ కూడా చేశారు. కాంగ్రెస్ హై కమాండ్ తో చంద్రబాబు చేతులు కలిపి జగన్ ను కష్టపెట్టారని నాటి విషయాల నుంచి నేడు ప్రతిపక్షంలో చంద్రబాబు చేస్తున్న విమర్శల వరకూ రకరకాల విషయాలపై విమర్శలు చేశారు. మరోవైపు నేడు వైఎస్ రాజశేఖరరెడ్డి 10వ వర్ధంతి సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయకు చేరుకుని, వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.