కాసేపట్లో గద్దెలమీదకు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు

0
80

తెలంగాణ కుంభమేళా, ఆసియాలో అతి పెద్ద మేడారం జాతర ప్రారంభమయ్యింది. మొదటిరోజు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుని మెక్కులు చెల్లించారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించారు. కన్నెపల్లి ఆలయంలో సారలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాసేపట్లో జంపన్న వాగు దాటి గద్దెల వద్దకు సారలమ్మ చేరుకోనుంది.