ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్..ఏడాది పాటు ఆ సేవలు ఉచితం!

0
76

ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ తన యూజర్లకు గుడ్ న్యూస్ తెలిపింది. ఇతర టెలికాం సంస్థలు అందిస్తున్నట్లు గానే ఓటీటీ సేవలను ఉచితంగా అందించేందుకు సిద్దం అయ్యింది. దీర్ఘకాల వ్యాలిడిటీ ప్లాన్‌లో భాగంగా ఇప్పటి వరకు ఉన్న రూ.2999 ప్లాన్‌ను ఎయిర్‌టెల్‌ సైలెంట్‌గా అప్‌గ్రేడ్ చేసింది.

ఎయిర్‌టెల్‌ రూ.2999 ప్లాన్‌ రీచార్జ్ చేసుకుంటే 356 రోజుల వ్యాలిడిటీ పొందవచ్చు. రోజుకు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100ఎస్ఎంఎస్‌లు, రూ.499 విలువ గల డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా పొందవచ్చు. నెలపాటు అమెజాన్ ప్రైమ్ మొబైల్‌ ఎడిషన్ ఫ్రీ ట్రయల్‌ను కూడా వినియోగించుకోవచ్చు.